తెలంగాణ

telangana

ETV Bharat / crime

స్నేహితుడి ఇంట్లో యువకుడి బలవన్మరణం - Man Suicide in Friends House in ghatkesar

Man Suicide in Friend's House : వ్యాపారంలో పెట్టుబడి కోసం అప్పు అడుగుదామని తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు ఓ యువకుడు. రాత్రి భోజనం చేసి అక్కడే నిద్రపోయాడు. బారెడు పొద్దెక్కినా స్నేహితుడు ఇంకా లేవలేదేంటని గదిలోకి వెళ్లిన చూసేసరికి తన స్నేహితుడు ఫ్యాన్​కు ఉరివేసుకుని ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగింది.

Ghatkesar Suicide
స్నేహితుడి ఇంటికి వచ్చి బలవన్మరణం

By

Published : Jun 12, 2022, 12:31 PM IST

Updated : Jun 12, 2022, 12:46 PM IST

Man Suicide in Friend's House : వ్యాపారంలో పెట్టుబడి కోసం అప్పు అడగడానికి తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భరత్​నగర్​కు చెందిన ఓంకార స్వామి(28) ఎంబీఏ చదివేటప్పుడు భూపాలపల్లికి చెందిన అనిల్‌ కుమార్‌తో స్నేహం ఏర్పడింది. అయితే అనిల్‌ రెండు నెలల క్రితం ఘట్‌కేసర్‌లోని ఎన్​ఎఫ్​సీ నగర్‌లో ఇల్లు కట్టి గృహప్రవేశం చేశాడు. ఓంకార స్వామి అనిల్‌ కమార్‌ వద్ద కొంతకాలంగా ఉంటున్నాడు.

ఇటీవల సిద్దిపేటకు వెళ్లిన ఓంకార స్వామి ఈనెల 4న అనిల్‌ కుమార్‌ ఇంటికి వచ్చి వ్యాపారం కోసం పెట్టుబడి కావాలని అడిగాడు. రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు, ఉదయం బయటకు రాకపోవడంతో గదిని బలవంతంగా తెరచి చూడగా ఓంకారస్వామి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు, కుటుంబీకులకు అనిల్‌ కుమార్‌ సమాచారం అందించారు.

Last Updated : Jun 12, 2022, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details