ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలోని.. దోల్దలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని 160వ బెటాలియన్‌కు చెందిన ధర్మేంద్ర సాహుగా గుర్తించిన అధికారులు చికిత్స కోసం అతడిని రాయ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ఏవోబీలో పేలిన మందుపాతర.. జవానుకు తీవ్రగాయాలు - Maoist Actions in AOB news
ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలో.. దోల్దలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. బీఎస్ఎఫ్కు చెందిన ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
ఏవోబీలో పేలిన మందుపాతర.. జవానుకు తీవ్రగాయాలు
మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో.. ఛత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్, ఒడిశా బీఎస్ఎఫ్ బలంగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇదే సమయంలో మందు పాతర పేలి.. జవాను గాయపడ్డాడు.
ఇదీ చదవండి:ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి