ACB Arrest DSP Jagan : అవినీతి ఆరోపణలపై డీఎస్పీ జగన్‌ను అనిశా అధికారులు అరెస్టు చేశారు. హెచ్‌ఎండీఏలోని విజిలెన్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన సమయంలో ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనం కూల్చకుండా ఉండేందుకు కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి వద్ద నుంచి 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
లంచం కోసం డిమాండ్
ఈ మొత్తానికి సంబంధించి ముందుగా 2 లక్షల రూపాయలు... రెండు నెలల క్రితం మరో 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. బదిలీ అయినప్పటికీ మిగితా లంచం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు జగన్ నివాసంతో పాటు అతని కుటుంబసభ్యుల నివాసంలోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.