తెలంగాణ

telangana

ETV Bharat / crime

పరిహారం ఇవ్వట్లేదని.. ఆటోకు నిప్పంటించాడు

యాదాద్రి భువనగిరి జిల్లా భస్వాపురం జలాశయంలో తన భూమికి పరిహారం అందకపోవడంతో ఓ నిర్వాసితుడు ఆదివారం మద్యాహ్నం ప్రాజెక్టు కట్టపై హల్​చల్ సృష్టించాడు. నిర్మాణ పనులను ఆపాలంటూ సొంత ఆటోపై డీజిల్ పోసి నిప్పంటించాడు.

yadadri bhuvanagiri rservoir
పరిహారం ఇవ్వట్లేదని.. ఆటోకు నిప్పంటించాడు

By

Published : Apr 12, 2021, 2:58 AM IST

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం భస్వాపురం జలాశయంలో తన భూమికి పరిహారం ఇవ్వట్లేదని ఓ నిర్వాసితుడు వీరంగం సృష్టించాడు. భువనగిరి మండలం బి.ఎన్.తిమ్మాపూర్​కి చెందిన పిన్నం సతీశ్​కి 12 ఎకరాల భూమి ఉండగా.. అందులో తొమ్మిది ఎకరాల భూమి మరో వ్యక్తి పేరుతో నమోదైంది. దీంతో ఇటీవల ఇరువురి మధ్య ఏర్పడిన వివాదాన్ని గ్రామ పెద్దలు ఒప్పంద పత్రం రాయించి సమస్యను పరిష్కరించారు.

భూమిలో 75 శాతం పరిహారం సతీశ్​కు అందించాల్సి ఉండగా.. గత మూడు నెలలుగా వెంటనే ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చి జమ చేయలేదు. విసిగిపోయిన బాధితుడు నిర్మాణ పనులను ఆపాలంటూ సొంత ఆటోపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఆటో కొంత దగ్దం కాగా... స్థానికులు విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. సదరు వ్యకిని నిలువరించారు. సాయంత్రం మరోమారు బాధితుడు వంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డటంతో స్థానికులు అతన్ని రక్షించారు.

ఇదీ చదవండి:సాగర్‌లో గెలుపే లక్ష్యం... ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details