పిల్లలకు భారం కాకూడదని వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన తాటికాయల మల్లయ్య, ఎల్లమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Suicide: పిల్లలకు భారం కావొద్దని... తనువు చాలించిన వృద్ధ జంట - An elderly couple committed suicide
నూరేళ్లు కలిసి జీవించాలని ఒక్కటయ్యారు. కష్టసుఖాల్లో తోడుగా నిలవాలని అనుకున్నారు. ఇన్నేళ్లు అలానే జీవించారు. పెళ్లి, పిల్లలు వాళ్ల పిల్లలు ఇలా సంతోషంగా గడుపుతున్నారు. వయసు మీద పడుతోంది. అనారోగ్యం వెంటాడుతోంది. ఇక పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భారంగా మారకూడదని భావించినా ఆ జంట తనువు చాలించింది.
తనువు చాలించిన వృద్ధ జంట
ఏమైందో ఏమో కానీ పిల్లలకు భారంగా మారామని ఇరువురం ప్రాణాలు తీసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించిన ఆ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగారు. ముందుగా ఎల్లమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడువగా కొన ఊపిరితో ఉన్న సాయిలును అంబులెన్సులో వరంగల్ ఎంజీఎంకు తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. కలిసి జీవిద్దామని ఒక్కటైన ఆ జంట వృద్ధాప్యానికి తలొగ్గి మరణించడం ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది.
ఇవీ చూడండి: