ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నాగార్జుననగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లి, కుమార్తెను ఓ దుండగుడు కత్తితో నరికి చంపాడు. దీంతో ఇల్లంతా రక్తసిక్తంగా మారింది. హత్యలకు ఆస్తి పంపకాల గొడవే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Crime news: గుంటూరు జిల్లాలో దారుణం.. తల్లి, కుమార్తె దారుణహత్య
ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జున నగర్లో దారుణం చోటుచేసుకుంది. తల్లీకుమార్తెలను ఓ దుండగుడు పాశవికంగా కత్తితో నరికి చంపాడు. సమీప బంధువే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Crime news: గుంటూరు జిల్లాలో దారుణం.. తల్లి, కుమార్తె దారుణహత్య
మృతులు ప్రత్యూష (25), తల్లి పద్మావతి(55)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సమీప బంధువే ఈ హత్యలకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడిని గుర్తించి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలోని సీసీ ఫుటేజీ, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి:CRIME: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. చివరికి..!
Last Updated : Aug 28, 2021, 10:19 PM IST