తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్‌ శివారులో తెరాస నాయకులు కాల్పులు, వీడియో వైరల్ - యాచారంలో ఎయిర్ గన్​తో కాల్పులు

Firing in Yacharam నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అక్కడ విందు చేసుకున్న కొందరు యువకులు తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. నెల క్రితం జరిగిన ఘటన వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తుపాకి, పెల్లెట్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Firing
Firing

By

Published : Aug 16, 2022, 10:25 AM IST

Updated : Aug 16, 2022, 11:00 AM IST

ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపిన తెరాస నాయకులు

Firing in Yacharam: రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్వీ కందుకూరు అధ్యక్షుడు విఘ్నేశ్వర్‌రెడ్డి, మరో నాయకుడు విక్రమ్‌... తుపాకితో కాల్పులు జరిపి ఆ దృశ్యాలను... సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడకు చెందిన జిట్టా రవీందర్‌రెడ్డికి యాచారం మండలం నజ్దిక్‌సింగారం రెవెన్యూ పరిధిలో ఫాంహౌస్‌ ఉంది. ఇందులో కందుకూరు చెందిన యువకులు అప్పుడప్పుడు విందు చేసుకుంటుంటారు.

జులై 14న ఏర్పాటు చేసిన విందులో విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రంరెడ్డి సహా 15మంది యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి తన వద్ద ఉండే ఎయిర్‌గన్‌ను బయటకు తీసి మిత్రులకు చూపాడు. దాన్ని తీసుకుని కొందరు గాలిలోకి కాల్పులు జరుపుతూ ఫొటోలు దిగారు. గాల్లోకి పేలుస్తూ తీసిన వీడియోను ఆ రోజే కొందరు వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకుని కొద్దిసేపటి తరువాత తీసేశారు. అందులోని వీడియో ఒకటి సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. యాచారం సీఐ లింగయ్య.. ఫాంహౌస్‌ను పరిశీలించి అక్కడ ఉన్న ఎయిర్‌గన్‌ (మోడల్‌-35), పిల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గన్‌ కొనుగోలు చేసిన పత్రాలను పరిశీలించారు. పక్షులు, అడవి పందులు పంట ధ్వంసం చేయకుండా రక్షించుకోవడానికి ఎయిర్‌గన్‌ను కొనుగోలు చేసి వాడుతున్నట్లు జిట్టా రవీందర్‌రెడ్డి చెప్పారు. మారణాయుధాల చట్ట పరిధిలోకి (ఆర్మ్‌ యాక్టు) ఎయిర్‌ గన్‌ రాదని సీఐ లింగయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 16, 2022, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details