తెలంగాణ

telangana

మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి

By

Published : Mar 8, 2021, 11:00 AM IST

Updated : Mar 8, 2021, 1:55 PM IST

acid-attack-on-a-woman-in-medak-district-on-the-occasion-of-womens-day-2021
మహిళా దినోత్సవం రోజునే మహిళపై యాసిడ్ దాడి

10:58 March 08

మహిళా దినోత్సవం రోజునే మహిళపై యాసిడ్ దాడి

మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి

           అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్​లో చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండాకు చెందిన మహిళపై సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్​తో దాడి చేశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. 

             ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి గురించి స్థానికుల్ని ఆరా తీశారు. వీలైనంత త్వరలో ఘటనకు కారణమైన వారిని పట్టుకుంటామని తెలిపారు. 

ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పాలని అధికారులకు సూచించారు. విచారణ వేగంగా జరిపి దోషులను శిక్షిస్తామని మంత్రి పేర్కొన్నారు. 

Last Updated : Mar 8, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details