రెెండు బస్సులు, ఒక లారీ ఢీ.. ముగ్గురు మృతి - ap crime news
08:46 March 29
ఏపీ : విజయనగరం జిల్లాలో ప్రమాదం
ఏపీలోని విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుంకరిపేట వద్ద 3 వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. గ్యాస్ సిలిండర్ల లారీ, 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 28 మందికి గాయాలయ్యాయి.
టైరు పేలి విశాఖ బస్సు.. విజయనగరం బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ.. విజయనగరం ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. రెండు బస్సుల్లోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు బస్సుల డ్రైవర్లు ఆశీర్వాదం, కె.దేవుడుతో పాటు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బాసురు గ్రామానికి చెందిన సన్యాసినాయుడు మృతి చెందారు.
ఘటన జరిగిన ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉండటంతో చెత్తను తగులబెట్టారు. పొగ రహదారిని కమ్మేసింది. ఈ సమయంలో అటుగా వచ్చిన వాహనాలకు దారి కనిపించలేదు. దీంతో పాటు వాహనాల అతివేగం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్, ఎస్పీ రాజకుమారి సంఘటనా ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
- ఇదీ చదవండి :రాష్ట్రంలో 1690కి చేరిన కరోనా మరణాలు