ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఉట్నూర్ మండలం గోదరిగూడ సమీపంలో ఆటో చెట్టును ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు నిర్మల్ జిల్లా కుంటాల, భైంసా వాసులుగా గుర్తించారు. వర్షాల నేపథ్యంలో వసతి గృహాల్లోని పిల్లలను తీసుకొచ్చేందుకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతదేహాలు, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు - గోదరిగూడ యాక్సిడెంట్ వార్తలు
చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
13:26 July 13
చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
Last Updated : Jul 13, 2022, 2:11 PM IST