తెలంగాణ

telangana

ETV Bharat / crime

Online Harassment to Girl: సోదరి వరసైన బాలికకు ఆన్‌లైన్‌లో వేధింపులు.. డిగ్రీ విద్యార్థి అరెస్ట్ - వరుసకు చెల్లి

Online Harassment to Girl: వరసకు చెల్లి అయ్యే బాలికను వేధిస్తున్నయువకుడి ఆట కట్టించారు సైబర్​ క్రైమ్ పోలీసులు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య సందేశాలు పంపుతున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండాకు చెందిన భూక్యా పవన్​ను రిమాండ్​కు తరలించారు.

Online Harassment to Girl
సోదరి వరసైన బాలికకు ఆన్‌లైన్‌లో వేధింపులు

By

Published : Feb 1, 2022, 10:56 AM IST

Online Harassment to Girl: సోదరి వరసైన బాలికను ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేస్తున్న డిగ్రీ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సై వెంకటేశ్ వెల్లడించారు.

harassment in social media: జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండాకు చెందిన భూక్యా పవన్‌(19) బోడుప్పల్‌లోని అక్కా,బావల వద్ద ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. అతని జూనియర్‌ అయిన ఓ బాలికతో పరిచయమైంది. గతేడాది పవన్‌ సొంతూరికి వెళ్లగా.. అదే గ్రామంలో ఉండే అమ్మమ్మ ఇంటికి ఆ బాలిక వచ్చింది. ఇరువురూ మంచి స్నేహితులయ్యారు. తరచూ ఫోన్లలో మాట్లాడుకోసాగారు. సెలవులు పూర్తయ్యి నగరానికి వెళ్లిపోతున్న ఆమెకు పవన్‌ ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో బాలిక అతని ప్రేమను నిరాకరించింది.

వరుసకు అన్నాచెల్లెళ్లు

sister relation: పైగా వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారంటూ బంధువులు తెలిపారు. అయినా తరచూ ఫోనుచేసి వేధిస్తుండడంతో బాలిక అతని నంబరును బ్లాక్‌ చేసింది. పవన్‌ కక్ష పెంచుకొని సామాజిక మాధ్యమాల్లో అసభ్య సందేశాలు, చిత్రాలు ఉంచాడు. బాలిక కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details