తెలంగాణ

telangana

ETV Bharat / crime

Brain stroke: కాళ్లపారాణి ఆరకముందే.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది - బ్రెయిన్‌స్ట్రోక్‌

Brain stroke : ఆమె తన కొత్త జీవితాన్ని ఎన్నో ఆశలతో ప్రారంభించింది. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్న సంతోషంలో మునిగి తేలింది. ఆమెను చూసి కాలానికే కన్ను కుట్టిందేమో.. దేవుడికే అసూయ పుట్టిందేమో గానీ అర్ధాంతరంగా ఆమె జీవితం ముగిసిపోయింది. కాళ్లపారాణి ఆరకముందే తీవ్రమైన గుండెపోటు వచ్చి బ్రెయిన్‌స్ట్రోక్​తో మరణించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్​లో జరిగింది.

Brain stroke
Brain stroke

By

Published : May 30, 2022, 12:04 PM IST

Brain stroke: కాళ్లపారాణి ఆరకముందే ఓ నవ వధువుకు నూరేళ్లు నిండాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె కలలు కొద్ది రోజుల్లోనే కనుమరుగయ్యాయి. ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి పట్ల అంతలోనే విధి వక్రీకరించింది. మెట్టినింట్లో అడుగు పెట్టానన్న సంతోషం లేకుండా శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయేలా చేసింది. తీవ్రమైన గుండెపోటుకు గురైన యువతి బ్రెయిన్‌స్ట్రోక్​తో తనువు చాలించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్​లో జరిగింది.

మెదక్‌ పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన రాఘవేంద్రకు పార్వతీపురానికి చెందిన ఉష(23) రెండేళ్లుగా ప్రేమించుకుని ఈ నెల 11న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. కొంగొత్త ఆశలతో, ప్రేమించిన వాడినే మనువాడానన్న సంతోషంతో నవ వధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. అత్తవారి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్న సమయంలో శుక్రవారం ఆమెకు తలనొప్పి రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు వైద్యుడికి చూపించారు. అతడి సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం మూర్ఛ రాగా, ఒక్కసారి తీవ్రమైన గుండెపోటు వచ్చి బ్రెయిన్‌స్ట్రోక్​తో మరణించింది.

ABOUT THE AUTHOR

...view details