తెలంగాణ

telangana

ETV Bharat / crime

ట్రాన్స్​ఫార్మర్ పేలి మహిళ దుర్మరణం - అనంతపురం జిల్లాలో విద్యుదాఘాతంలో మహిళ మృతి

ఏపీలోని అనంతపురం జిల్లా మంగళమడక గ్రామంలో ట్రాన్స్​ఫార్మర్ పేలింది. ఫలితంగా విద్యుదాఘాతానికి గురై.. ఓ మహిళ మృతి చెందింది. ట్రాన్స్​ఫార్మర్ పేలటంతో గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురై.. పరుగులు తీశారు. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు.

women died transformer blast
women died transformer blast

By

Published : Aug 6, 2021, 9:02 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మంగళ మడక గ్రామంలో పెద్ద శబ్దంతో విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్ పేలింది. నివాసాల మధ్య ఉన్న ట్రాన్స్​ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై.. ప్రమీలమ్మ అనే మహిళ మృతి చెందింది. భారీ శబ్దంతో పేలడం వల్ల.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో గ్రామంలోని విద్యుత్ ఉపకరణాలు సైతం కాలిపోయాయి.

అధిక ఓల్టేజీ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు.. మంగళమడక గ్రామానికి వెళ్లి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇవీచూడండి:మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్​కు ప్రమాదం..

ABOUT THE AUTHOR

...view details