తెలంగాణ

telangana

ETV Bharat / crime

భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య - మేడ్చల్​ వార్తలు

అనారోగ్య సమస్యలతో ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా పేట్​బషీరాబాద్​లో జరిగింది.

మహిళ ఆత్మహత్య
a women commit suicide, medchal

By

Published : Mar 25, 2021, 4:25 PM IST

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధి పద్మనగర్ ఫేస్ 2లో విషాదం జరిగింది. అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్వాతి అనే మహిళ ఇటీవలే సింగపూర్ నుంచి తల్లి వద్దకు వచ్చింది. అప్పటి నుంచి పద్మానగర్​లోని తల్లి వద్దనే ఉంటోంది.

అనారోగ్య సమస్యల కారణంగా పలుమార్లు తాను చనిపోతానని బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:వైద్య విద్యార్థి ఆత్మహత్య.. ప్రేమ విఫలమే కారణం!

ABOUT THE AUTHOR

...view details