ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటు వేయడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందగా... చిన్నారి తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నారు. ఈఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురంలో జరిగింది.
snake that bites three people:ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము - పాముకాటుకు ముగ్గురు బలి
11:52 November 07
పాముకాటుతో 3 నెలల చిన్నారి మృతి
గ్రామానికి చెందిన క్రాంతి- మమత దంపతుల మూడు నెలల చిన్నారికి అనారోగ్య సమస్య కారణంగా కొన్ని రోజులుగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. పాపను ఆస్పత్రి నుంచి శనివారం ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయంలో పాప నోటి నుంచి నురుగు రావడం గమనించిన తల్లిదండ్రులు కంగారుపడి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... పాపకు కప్పి ఉంచిన దుప్పటి నుంచి పాము కిందపడింది.
కింద పడిన పాము పాప తల్లిదండ్రులు క్రాంతి, మమతను కాటు వేసింది. ఈ ముగ్గురిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందింది. పాప తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ పాపకు ఆరోగ్యం బాలేకపోతే ఖమ్మంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టారు. ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పాపకు కప్పిన చద్దురులో పాము ఉంది. మొదట పాపను కాటువేసింది. వెంటనే పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాము. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. పాము కింద పడి.. ఆ పాప తండ్రిని కరిచింది. పాప అప్పటికే మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందించాలని కోరుతున్నాము. -స్థానికుడు.
ఇదీ చూడండి:Police accident today: లారీని ఢీకొన్న పోలీసు వాహనం.. ఏఎస్సై పరిస్థితి విషమం