MAN HALCHAL ON METRO TRACK: సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో మార్గంలో వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. మెట్రో రైల్వే స్టేషన్ ట్రాక్‌పై నడుస్తూ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. దీంతో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అతన్ని గమనించిన మెట్రో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మెట్రో కార్యకలాపాలకు ఆటంకం కలిగించిన వ్యక్తి బిహార్‌కు చెందిన దిలీప్‌గా పోలీసులు గుర్తించారు. అతను ఫుట్‌పాత్‌పై జీవనం కొనసాగిస్తున్నాడని వెల్లడించారు. బోయిగూడ సమీపంలో ఉన్న జనరల్ రైల్వే ట్రాక్ మీదుగా మెట్రో పిల్లర్ గ్యాబ్ నుంచి మెట్రో ట్రాక్ పైకి ఎక్కి ఉంటాడని పోలీసులు తెలిపారు.