man died at jeedimetla : హైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధి అపురూప కాలనీ వద్ద మురుగు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో కాలువలో పడిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన గండికోట శ్రీనివాస్ (36) పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి అపురూపా కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే కాలనీలో ఓ మెస్‌లో పనిచేస్తున్నాడు.
man died at jeedimetla : మద్యం మత్తులో మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి - మోరీలో పడి వ్యక్తి మృతి
man died at jeedimetla : మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రమావదశాత్తు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. ఈ ఘటన జీడిమెట్ల ఠాణా పరిధి అపురూపా కాలనీ వద్ద జరిగింది.
jeedimetla
మంగళవారం రాత్రి జీడిమెట్ల బస్‌డిపో వద్ద ఉన్న కాలువ పిట్టగోడపై కూర్చుని మద్యం సేవించి.. మత్తులో కాలువలో పడి మృతి చెందాడు. మద్యం మత్తులో కాలువలో పడిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Subbakkapally Mirchi Farmer suicide : పురుగుల మందు తాగి మిరప రైతు ఆత్మహత్య