ఈ నెల 10న పహాడీషరీఫ్ ఠాణాకు కూతవేటు దూరంలో ఉన్న ఫంక్షన్‌హాల్లోకి రాత్రి 11:30గంటల సమయంలో ఓ అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్న ఓ బస్సులో తలదాచుకుంది. బస్సులో ఉన్న ఆమెను నిర్వాహకులు చేరదీసి.. సపర్యలు చేశారు. అనంతరం వివరాలు అడగ్గా ‘బచావ్.. బచావ్..’ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టింది. నిర్వాహకులు సీసీ ఫుటేజీని పరిశీలించగా ఎదురుగా ఉన్న బాలాపూర్- సుల్తాన్‌పూర్ రోడ్డులోని అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిర్వాహకులు ద్విచక్రవాహనంపై బాధితురాలిని తీసుకెళ్లి పహాడీషరీఫ్ ఠాణాలో అప్పగించారు.
అడవిలో నుంచి అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ వచ్చింది.. ఇంతకీ ఆమెవరు? ఆ రాత్రి ఏం జరిగింది? - రాత్రివేళ ఫంక్షన్హాల్కి వచ్చిన యవతి
రాత్రి 11:30 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో నుంచి ఓ అమ్మాయి(18) పరుగెత్తుకుంటూ ఎదురుగా ఉన్న ఫంక్షన్‌హాల్‌లోకి వెళ్లి అక్కడే ఉన్న బస్సులో తలదాచుకుంది. మత్తులో ఉన్న ఆమెను నిర్వాహకులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలో అప్పగించారు. ఆమె ఎవరు..? ఎందుకలా పరుగెత్తుకుంటూ వచ్చింది..? అని తేల్చాల్సిన పోలీసులు బాధితురాలిని ఆశ్రమానికి తరలించి చేతులు దులుపుకొన్నారు.
బాధితురాలికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమెను తుక్కుగూడలోని ఆశ్రమానికి తరలించారు. అంతే అక్కడితో తమ పని అయిపోయిందనిపించుకున్నారు. కేసు నమోదు చేయడం సంగతి పక్కన పెడితే నిజంగానే అత్యాచారం జరిగిందా.. లేదా..? అంటూ వైద్యపరీక్షలు చేయించలేదు. ఆమె ఎవరో..? అంటూ వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి:Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!