A disabled boy was burnt alive in Hyderabad: హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి లాల్వాణీ నగర్‌లో దివ్యాంగ బాలుడు సజీవ దహనమయ్యాడు. నాలా సమీపంలో నిప్పంటుకున్న చెత్తలో యువన్ అనే పదేళ్ల దివ్యాంగ బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల నుంచి ఆ బాలుడు ఇంట్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు ఇచ్చారు.
మంటల్లో పడి బాలుడు సజీవదహనం.. అసలేం జరిగిందంటే? - latest crime news in hyderabad
A disabled boy was burnt alive in Hyderabad: చిన్న పిల్లలు ఒక్కదగ్గరే ఉండకుండా తిరుగుతునే ఉంటారు. ఒక్కోసారి వాళ్లకి తెలియని ప్రదేశాలకి వెళ్లిపోతారు. అయితే హైదరాబాద్ జిల్లాలోని ఒక దివ్యాంగ బాలుడు తల్లిదండ్రులకు కనిపించకుండా రెండు రోజులు గడిచిన తిరిగి రాలేదు. ఇంతకి ఆ బాలుడికి ఏమైందంటే?
దివ్యాంగ బాలుడు సజీవ దహనం
చెత్తకుప్పలో కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తుంచి... పోలీసులకు సమాచారం ఇచ్చింది. నాలాకు వేసిన కంచె దాటే క్రమంలో యువన్ పక్కనే ఉన్న మంటల్లో జారిపడి కాలిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: