Viral video: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని తిరుమల హిల్స్‌లో ఓ మహిళ మెడ నుంచి పుస్తెల తాడు దొంగలించాడు. తిరుమల హిల్స్‌కు చెందిన అరుణ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు గొలుసు ఎత్తుకెళ్లాడు.
సైబరాబాద్‌లో రెచ్చిపోతున్న గొలుసు దొంగలు.. సీసీ కెమెరాలో దృశ్యాలు - వైరల్ వీడియోలు
Viral video: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా కొందరు దొంగలు బైక్‌పై వచ్చి మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దోచేస్తున్నారు. తాజాగా తిరుమల హిల్స్‌కు చెందిన ఓ మహిళ మెడలోంచి పుస్తెల తాడుని.. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదు కావడంతో వైరల్ అయ్యాయి.
chain snatching
నెల రోజుల వ్యవధిలో ఇది నాల్గొవది: బాధితురాలు చెప్పిన వివరాలు ప్రకారం దుండగుడు తీసుకెళ్లిన బంగారం పుస్తెల తాడు 3.5 తులాలు ఉంటుందని అంచాన వేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో శంషాబాద్, రాజేంద్రనగర్, నార్సింగిలో వరుస గొలుసు దొంగతనాలు జరుగుతుండటంతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 11, 2022, 7:01 PM IST