Road Accident: జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రహదారిలో తారకరామనగర్ వద్ద ఓ యూరియా లారీ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును, కారును ఢీ కొట్టిన లారీ... అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చిన్నకాలువలో పడి పోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందగా ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
లారీ బీభత్సం.. బస్సు, కారును ఢీకొట్టి.. కాలువలోకి.. - లారీ బీభత్సం
Road Accident: జగిత్యాల పట్టణంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు, కారును ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న చిన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా బస్సులో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
accident
కరీంనగర్ నుంచి యూరియా లోడుతో జగిత్యాలకు వస్తున్న లారీ... ఆర్టీసి బస్సును ఓవర్ టేక్ చేయబోయి బస్సును ఢీ కొట్టింది. ఎదురుగా వస్తున్న కారును తాకుతూ వెళ్లిన లారీ అదే వేగంతో వెళ్లి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ బాబా మృతి చెందగా.. క్లీనర్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: