తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉప్పల్​లో జోతిష్యుడి దారుణ హత్య.. అడ్డుకోబోయిన కొడుకు కూడా.. - జోతిష్యం నరసింహమూర్తి హత్యకేసు

Uppal murder case: హైదరాబాద్​లోని ఉప్పల్​ పోలీసు స్టేషన్​ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హనుమాన్​ నగర్​లో నివాసం ఉంటున్న తండ్రి, కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు మరణ ఆయుధాలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Uppal murder case
Uppal murder case

By

Published : Oct 14, 2022, 11:00 AM IST

Uppal murder case: హైదరాబాద్​ ఉప్పల్​ పోలీసు స్టేషన్​ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హనుమాన్​ నగర్​లో నివాసం ఉంటున్న నరసింహమూర్తి(70) పై గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు తెల్లవారు జామున మరణ ఆయుధాలతో దాడి చేశారు. అడ్డుకోపోయిన కొడుకు శ్రీనివాస్​పై కూడా దుండగులు దాడి చేయడంతో తీవ్రగాయలతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ‌ నరేష్ రెడ్డి, సీఐ గోవిందా రెడ్డి ఘటన స్థలికి చేరుకొని హత్యలకు గల కారణాలపై వెలికితీస్తున్నారు. ఆస్తి కోసమే దగ్గరి బంధువులు హత్య చేశారా! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాస్​ సింగపూర్​ నుంచి నెల రోజుల కిందటే ఉప్పల్​కు రాగా.. నరసింహమూర్తి జోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details