తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​లో మరోసారి హవాలా డబ్బు పట్టివేత.. ఈసారీ పెద్ద మొత్తంలోనే..!

hawala money seized in Hyderabad: హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చి పరిశీలించగా.. రెండు కార్లలో రూ.79 లక్షల హవాలా సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

By

Published : Oct 9, 2022, 9:43 AM IST

hawala money
హవాలా డబ్బు

hawala money seized in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి భారీగా హవాలా డబ్బులు పట్టుబడటం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.79 లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్‌ మాలిక్‌, సల్మాన్‌ మాలిక్‌.. హైదరాబాద్‌ వాసులు వెంకట్‌రెడ్డి, శేఖర్‌ రెండు వేర్వేరు కార్లలో రూ.79 లక్షలు తరలిస్తుండగా.. చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.

నగదుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి ఆధారాలు, రసీదులు లేకపోవడంతో హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న సొమ్ముగా పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేశారు. అయితే భారీగా తరలిస్తున్న నగదు ఎవరి ఆదేశాలతో తీసుకువెళ్తున్నారు, ఎవరికి అందజేయడానికి అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details