మద్యం తాగేందుకు స్నేహితుడి ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. రూ.75 లక్షలతో పరారైన ఘటన ఇది. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మూసారాంబాగ్ డివిజన్ సలీమ్‌నగర్ కాలనీలో నివసించే సాయిప్రకాష్‌రెడ్డి (25) స్థిరాస్తి వ్యాపారి. గోవాకు చెందిన అతని మిత్రుడు ఫిరోజ్ శుక్రవారం రాత్రి వచ్చాడు. పబ్‌కు వెళ్దామని ఫిరోజ్ కోరడంతో కొత్తపేట్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు.
అక్కడ పాతమిత్రుడు రాజేష్ కలిశాడు. సాయిప్రకాష్‌రెడ్డి, ఫిరోజ్, రాజేష్‌లతోపాటు రాజేష్ మిత్రుడు.. నలుగురూ కలిసి అర్ధరాత్రి తర్వాత మద్యం తాగేందుకు తిరిగి సలీమ్‌నగర్‌లోని సాయిప్రకాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
ఫిరోజ్ ఓ గదిలో పడుకున్నాడు. హాలులో ముగ్గురు కలిసి మద్యం తాగారు. సాయిప్రకాష్‌రెడ్డి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. బయటికి వచ్చిన తర్వాత తన గదిలో బెడ్ మీద ఖాళీ బ్యాగు కనిపించింది. హాలులో రాజేష్ అతని స్నేహితుడు కనిపించలేదు. భూమి విక్రయించగా వచ్చిన రూ.75 లక్షల నగదు ఆ బ్యాగులో ఉందని బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.