తెలంగాణ

telangana

ETV Bharat / crime

డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు... పరారీలోనే నవీన్‌రెడ్డి... 32 మంది అరెస్ట్‌ - Naveen Reddy arrested in Dentist Kidnap case

Hyderabad Dentist Kidnap Case
డెంటిస్ట్ కిడ్నాప్‌ కేసు... 32 మంది అరెస్ట్‌

By

Published : Dec 10, 2022, 2:38 PM IST

Updated : Dec 10, 2022, 6:18 PM IST

14:34 December 10

Hyderabad Dentist Kidnap Case

యువతి అపహరణ కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు

Dentist kidnap case Accused Naveen absconding రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ డెంటిస్ట్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నట్లు ఆదిభట్ల సీఐ నరేందర్‌ వెల్లడించారు. అతనికి సహకరించిన మరో 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదిభట్ల పీఎస్‌ నుంచి 32మంది నిందితులను తరలించారు.

వైద్య పరీక్షల కోసం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించిన పోలీసులు... వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. 32 మంది నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.ఇబ్రహీంపట్నం సెషన్స్‌ కోర్టుకు నిందితులను తరలించనున్నారు. యువతి అపహరణ కేసులో మొత్తం 36 మందిపై కేసులు నమోదు అయ్యాయి. నవీన్‌రెడ్డితో సహా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారని సీఐ నరేందర్‌ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం కుదిరిందని, శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మన్నెగూడలోని ఆమె నివాసంలో నిశ్చయ తాంబూలాలకు ముహూర్తమని నవీన్‌ రెడ్డికి తెలిసింది. పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్‌రెడ్డి.. యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిఛర్‌ను, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఫోన్లు పగలగొట్టారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువుని ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని నవీన్‌రెడ్డి కారులో అపహరించుకు పోయాడు. సుమారు 40 నిమిషాల్లోనే ఇదంతా ముగిసింది. పక్కా రెక్కీతో అపహరణ జరిగినట్టు తెలుస్తోంది. సంఘటన జరిగిన 6 గంటలలోపే పోలీసులు అమ్మాయిని రక్షించారు.

''కిడ్నాప్‌ కేసులో 32 మందిని అరెస్టు చేశాం. మొదటగా 31 మందిని అరెస్టు చేశాం. ఇంతకు ముందు మరోకరిని అరెస్టు చేశాం. మొత్తం 32 మందిని అరెస్టు చేశాం. వారిని రిమాండ్‌కు తరలిస్తున్నాం. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి ఇంకా పరారీలో ఉన్నాడు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్‌ కేసులు నమోదు చేశాం.'' - ఆదిభట్ల సీఐ నరేందర్‌

Hyderabad Dentist Kidnap case అయితే ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మాత్రం పోలీసులకు చిక్కలేదు. యువతి అపహరణకు ముందు అనుచరులను ఆఫీసుకు పిలిచిన నవీన్‌రెడ్డి.. సిబ్బందితో పాటు మరికొంత మందిని పిలిచినట్లు తేలింది. పార్టీ పేరుతో అక్కడే మద్యం ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు. మత్తులో ఉన్నవారిని తీసుకుని కారులో యువతి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. యువతి ఇంటిపై నవీన్‌ అనుచరులు, సిబ్బంది దాడి చేశారు. ప్రణాళిక ప్రకారమే యువతి ఇంటికి అందర్ని నవీన్ తీసుకొచ్చాడు. యువతి కిడ్నాప్ తర్వాత వివిధ మార్గాల్లో దుండగులు పారిపోయారు.

సంబంధిత కథనాలు:

Last Updated : Dec 10, 2022, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details