మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ డ్రగ్స్ వినియోగం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఈ డ్రగ్స్ హైదరాబాద్‌ను దాటి... ఖమ్మం నగరం దాకా పాకింది.
ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాల కలకలం
14:56 June 23
ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాల కలకలం
ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. ఖమ్మం నగరానికి చెందిన యువకుల నుంచి 10 గ్రాముల డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన యువకుల్లో ఒకరిపై బెంగళూరు, హైదరాబాద్‌లో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన యువకుల నుంచి డ్రగ్స్‌తో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మంలో ఇద్దరు యువకులను తీసుకున్నాం. వారి నుంచి 10 గ్రాముల డ్రగ్స్, 60 గ్రాములు హషీష్ ఆయిల్, 1600 గ్రాముల గంజాయిని సీజ్ చేశాం. వీళ్లలో ఒకరికి గతంలో నేర చరిత ఉంది. బెంగళూరులో వారికి డ్రగ్స్ డీలర్స్‌తో పరిచయాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా రెండు కేసులు ఉన్నాయి. తర్వాత 6 నెలల క్రితం తన స్థావరాన్ని ఖమ్మానికి మార్చుకున్నాడు. ఇక్కడి నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించాం. - నాగేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్
ఇవీ చూడండి: