భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నల్లబండబోడులో... ఆటోలో ఉన్న 27 లక్షలు విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు... ఆటోలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆటోలో 27లక్షల విలువైన గంజాయి తరలింపు - ఆటోలో గంజాయి
ఆటో పైకప్పుపై, సౌండ్ బాక్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికలతో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆటోలో 27లక్షల విలువైన గంజాయి తరలింపు
ఆటో పైకప్పులో, సౌండ్ బాక్సులో నిల్వ ఉన్న గంజాయిని... వెలికి తీశారు. ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి:గంజాయి తరలించేందుకు యత్నం... ఇద్దరు యువకులు అరెస్ట్