తెలంగాణ

telangana

ETV Bharat / crime

swanky villas in dundigal: 'మల్లంపేటలో 260 అక్రమ విల్లాలు...​' - మేడ్చల్​ వార్తలు

dundigal
dundigal

By

Published : Dec 6, 2021, 2:37 PM IST

Updated : Dec 6, 2021, 3:06 PM IST

14:21 December 06

'మల్లంపేటలో 260 అక్రమ విల్లాలు'

swanky villas in dundigal: మేడ్చల్​ జిల్లా మల్లంపేటలో 260 అక్రమ విల్లాలు ఉన్నాయని దుండిగల్​ మున్సిపల్​ కమిషనర్​ బోగీశ్వర్లు స్పష్టం చేశారు. వాటిని సీజ్​ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్​ హరీశ్​ ఆదేశాలతో విల్లాలను సీజ్​ చేసినట్లు వెల్లడించారు. శ్రీలక్ష్మి శ్రీనివాస్​ కనస్ట్రక్షన్​ కంపెనీపై చీటింగ్​ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

2018 సంవత్సరానికి ముందు మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. 2018-19లో దుండిగల్‌ పురపాలక సంఘం ఏర్పడగా అందులో భాగమైంది. ఆ సమయంలో మల్లంపేటలో ఓ స్థిరాస్తి సంస్థ 15 ఎకరాల్లో విల్లాలు మొదలుపెట్టింది. 65 విల్లాలకు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని మరో 260 అక్రమంగా మొదలుపెట్టింది. కత్వ చెరువు ఎఫ్‌టీఎల్‌లో రోడ్లు, బఫర్‌ జోన్‌లో కొన్ని విల్లాలు నిర్మించినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. సాగునీటి శాఖ ఈఈ విచారణ చేపట్టి, దుండిగల్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.

కలెక్టర్‌ రంగప్రవేశంతో...

illegal villas in dundigal : పోలీసులు, పురపాలిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మేడ్చల్‌ కలెక్టర్‌ హారీశ్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన విచారణ చేయగా ఏడు విల్లాలు చెరువు బఫర్‌ జోన్‌లో ఉన్నట్లు తేలింది. వాటి కూల్చివేతలు చేపట్టగా స్థిరాస్తి సంస్థ కోర్టు నుంచి స్టే తెచ్చుకొంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ హరీష్‌, మేడ్చల్‌ జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, డివిజనల్‌ పంచాయతీ అధికారి స్మిత తదితరులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు.

పంచాయతీ అనుమతులూ నకిలీవని, అప్పట్లో ఉన్న పంచాయతీ అధికారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించినట్లు తేల్చారు. తక్షణం వాటిని సీజ్‌ చేయాలని ఆదేశించారు. శనివారం నుంచి ఇవాళ్టి వరకు అన్నింటిని సీజ్ చేశారు. ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఉన్న నలుగురు మున్సిపల్‌ కమిషనర్లపై శాఖాపరమైన చర్యలు, అంతకు ముందున్న పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్​తో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ పరిస్థితులతో విల్లాలు కొనుగోలు చేసిన అనేక మంది ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి:Medak collector Press meet: 'అసైన్డ్ భూములను ఈటల కుటుంబం కబ్జా చేసింది నిజమే'

Last Updated : Dec 6, 2021, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details