మూత్రశాలల నిర్వహణ అస్తవ్యస్తం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్. దీన్ని స్వచ్ఛ నగరంగా ఉంచేందుకు బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించారు. అందులో భాగంగా వరంగల్, హన్మకొండ, కాజీ పేట పరిధిలో లక్షల వ్యయంతో 43 ప్రజా మూత్రశాలలతో పాటు ఐదు కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించారు.
గుత్తేదారులకు అప్పగింత
ఇప్పటిదాకా బాగానే ఉన్నా వాటి నిర్వహణను అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల సమస్య మొదలైంది. గుత్తేదారులు నిర్లక్ష్యంతో మూత్రశాలు తాళాలతో దర్శనమిస్తున్నాయి. చేసేదేమి లేక నగర ప్రజలు బహిరంగానే మలమూత్ర విసర్జన చేస్తున్నారు.
కాల్వల నిర్మాణం లేకే
కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు గానీ వాటికోసం కాల్వలు ఏర్పాటు చేయలేదని.. స్థానికుల ఒత్తిడితోనే నిర్వాహకులు తాళాలు వేసినట్లు తెలుస్తోంది. ప్రతాప్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ టాయిలెట్ వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు. మురుగు నీరుతో దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతున్నామని వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న సదరు నిర్వాహకులను తొలగించాలన్నారు. కాల్వలు నిర్మించి కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్లను వినియోగంలోకి తీసుకురావాలని నగర వాసులు కోరుతున్నారు.
ఇవీ చూడండి:టర్కీలో షూటింగ్... హీరో విశాల్‌కు గాయాలు