కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మధ్యమానేరు నుంచి ఎగువ మానేరుకు నీటిని తరలించేందుకు సర్కారు... గతంలో రూ. 911కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మధ్యమానేరు నుంచి 120 రోజుల పాటు 11.635 టీఎంసీల నీటిని ఎగువమానేరుకు తరలించే పనులకు అంచనా వ్యయాన్ని రూ. 996 కోట్లకు సవరించాలని నీటిపారుదల ఇంజినీర్ ఇన్‌చీఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈఎన్సీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ అంచనా వ్యయాన్ని సర్కారు రూ. 996 కోట్లకు పెంచింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
'తొమ్మిదో ప్యాకేజీ అంచనాలను సవరించిన సర్కారు'
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ అంచనాలను సర్కారు సవరించింది. మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని తరలించే పనుల అంచనా వ్యయాన్ని సవరించాలంటూ నీటిపారుదల ఇంజినీర్ ఇన్‌చీఫ్.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
'తొమ్మిదో ప్యాకేజీ అంచనాలను సవరించిన సర్కారు'