GATE Rankers in telangana: రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్-2022) ఫలితాలలో సత్తా చాటారు. వరంగల్ ఎన్‌ఐటీ విద్యార్థి మణిసందీప్‌రెడ్డి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా విద్యార్థి నిరంజన్ తన్నీర్ తొమ్మిదో ర్యాంకుతో మెరిశారు.
గేట్ ఫలితాల్లో సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులు - గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్
GATE Rankers in telangana: గేట్ విడుదల చేసిన ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో వరంగల్ జిల్లాకు చెందిన మణిసందీప్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నిరంజన్ తన్నీర్ మెటలార్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో తొమ్మిదో ర్యాంకు సొంతం చేసుకున్నారు.
మణిసందీప్‌రెడ్డి కెమికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. గేట్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ సొంతం చేసుకున్న మణి సందీప్‌రెడ్డిని నిట్ సంచాలకులు ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు అభినందించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామానికి చెందిన నిరంజన్ తన్నీర్ అఖిల భారత స్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించారు. మెటలార్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ ర్యాంకు సొంతం చేసుకున్నారు.
ఇదీ చదవండి:ఉద్యోగ ప్రకటనలతో సంబంధం లేదు... ఇక్కడ ఎప్పటినుంచో ఉచిత శిక్షణ