గుడుంబా అమ్మకం, తయారీ చేపట్టిన వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ ఆదేశించారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండలోని ఆర్ ఎండ్ బీ అతిథి గృహంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
'గుడుంబా తయారీదారులపై కఠినంగా వ్యవహరించండి' - గుడుంబా తయారీ
గుడుంబా తయారీ, అమ్మకం దారులను ఉక్కుపాదంతో అణిచివేయలని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
గుడుంబా తయారీ, అమ్మకం దారులపై పీడీ యాక్ట్ కేసులను నమోదు చేయాలన్నారు. అలాగే బైండోవర్ కేసుల్లో లక్ష రూపాయల పూచీకత్తును కఠినంగా అమలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆబ్కారీ అధికారులు తమ పదోన్నతులపై శ్రీనివాస్ గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు. అధికారులు ఇచ్చిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమీక్షా సమావేశంలో వరంగల్ అర్బన్ ఈఎస్ బాల స్వామి, ఏఈఎస్ శ్రీనివాస్ రావు, వరంగల్ ఏఈఎస్ శ్రీనివాస్, సీఐలు రామకృష్ణ, కరం చంద్, రంజిత్ రావు, ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.