వరంగల్ అర్బన్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి పండుగను పురస్కరించుకుని హన్మకొండలో వేకువజాము నుంచే మహిళలు ఇంటి ముందు అలికి ముగ్గులు వేశారు. చలిని సైతం లెక్క చేయకుండా చిన్నా, పెద్దా అంతా కలసి వేడుకల్లో పాల్గొన్నారు.
ముగ్గులతో నిండిపోయిన ఓరుగల్లు కాలనీలు
భోగి పండుగను పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా వాసులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే మంచును సైతం లెక్క చేయకుండా మహిళలు పోటీ పడి మరి ముగ్గులు వేశారు.
ముగ్గులతో నిండిపోయిన ఓరుగల్లు కాలనీలు
నగరంలో ఏ కాలనీ చూసిన ముగ్గులతో నిండిపోయింది. వివిధ రకాల రంగులతో వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి:భోగి మంటల అర్థం, పరమార్థం ఏంటీ..?