Sand problem in Medigadda project:గత నెలలో రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో పాటు.. ఉపనదుల వెంట భారీగా వరద నీరు వచ్చి చేరటం వల్ల మేడిగడ్డ దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహించింది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు జలసిరితో కళకళలాడింది. కానీ ఇప్పుడు అదే ప్రధాన సమస్యను తెచ్చిపెట్టింది.
ఎగువ నుంచి వరద రావడం వల్ల వరదతో పాటు ఇసుక పెద్ద ఎత్తున వచ్చి కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో వచ్చి చేరింది. ఈ బ్యారేజీకి ఇసుక మేట సమస్యగా మారింది. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వరదతో పాటు వచ్చి ఇసుక దిగువన ఉన్న ఈ బ్యారేజీ ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయింది. ఎటుచూసిన ఇసుక తిన్నెలతో బ్యారేజీ మెుత్తం రాష్ట్రానికి కొంత మేర ఇసుక సమస్యను తీర్చేదిగా ఉంది. కానీ గేట్లులో ఇసుక పేరుకుపోయి నీరు ప్రవహించకుండా ఇసుక దిబ్బలతో మారాయి.