వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాయపర్తి మండలం తిర్మలాయపల్లి శివారులో పోలీసు వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఘటనలో భార్య భర్తలు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రగాయాలైన రజిత అనే యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ప్రమాద ఘటనతో మృతుల బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. మృతదేహాలతో వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసు వాహనం ఢీకొని ముగ్గురు మృతి - వరంగల్ తాజా వార్తలు
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాయపర్తి మండలంలో నిన్న రాత్రి పోలీసు వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కోపోద్రేకులైన మృతుల బంధువులు మృతదేహాలతో వరంగల్-ఖమ్మం రహదారిపై ధర్నాకు దిగారు.
పోలీసు వాహనం ఢీకొని ముగ్గురు మృతి
వరంగల్ ఖమ్మం రహదారి పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. మృతుల బంధువులను శాంతింపజేసేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పోలీసులకు మృతుల బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య