లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్, పారిశుద్ధ్య కార్మికుల కోసం వరంగల్ పట్టణంలో ఉచిత క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్ కూడలిలోని క్యాంటీన్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేందర్ ప్రారంభించారు. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తోన్న వారికి అండగా నిలిచేందుకే క్యాంటీన్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
ఉచిత క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి - గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్ కూడలిలో ఉచిత క్యాంటీన్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తోన్న వారికి అండగా నిలిచేందుకే క్యాంటీన్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
ఉచిత క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి
లాక్డౌన్లో కార్మికులకు, కూలీలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. వలస కూలీలకు ప్రభుత్వమే వసతి కల్పిస్తోందని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:మారువేషంలో జేసీ.. అధిక ధరలపై ఆరా...