రాష్ట్రంలో శిథిలమవుతున్న కాకతీయ కట్టడాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయాన్ని మంత్రి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
'కేసీఆర్ కృషితోనే కాకతీయ కట్టడాలకు పూర్వవైభవం'
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో రుద్రేశ్వరుణ్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
'కేసీఆర్ కృషితోనే కాకతీయ కట్టడాలకు పూర్వవైభవం'
మరుగున పడుతున్న కాకతీయ కట్టడాలను పునరుద్ధరించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని ఎర్రబెల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే వేయి స్తంభాల కల్యాణమండపం మధ్యలోనే ఆగిపోయిందని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు.. ఎవరి ఇళ్లల్లో వారే జరుపుకోవాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండిఃశ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు