తెలంగాణ

telangana

ETV Bharat / city

మద్యం మత్తులో బిల్డింగ్​పై నుంచి తోసివేత.. వ్యక్తి మృతి - man found dead

మద్యం మత్తులో బిల్డింగ్​పై నుంచి ఓ వ్యక్తిని, ఇద్దరు నెట్టేసిన ఘటన వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటు చేసుకుంది. ఘటనలో నాగరాజు అనే వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు.

మద్యం మత్తులో బిల్డింగ్​పై నుంచి తోసివేత.. వ్యక్తి మృతి
మద్యం మత్తులో బిల్డింగ్​పై నుంచి తోసివేత.. వ్యక్తి మృతి

By

Published : May 6, 2020, 11:53 PM IST

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ వ్యక్తిని మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు బిల్డింగ్​పై నుంచి నెట్టి వేశారు. ఘటనలో నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇతర రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్న కూడా కాంప్లెక్స్ బిల్డింగ్​పై మద్యం తాగుతుండగా వారి మధ్య ఘర్షణ నెలకొంది.

ఘర్షణలో రమేష్ అనే వ్యక్తి నాగరాజును బిల్డింగ్​పై నుంచి నెట్టి వేయగా అతను అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తాగిన మైకంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని.. వివరాలు సేకరిస్తున్నామని సుబేదారి సీఐ అజయ్‌కూమార్‌ తెలిపారు. వీరు ఇక్కడే ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తారని వెల్లడించారు.

ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం

ABOUT THE AUTHOR

...view details