తెలంగాణ

telangana

ETV Bharat / city

వరంగల్​లో మళ్లీ వర్షం... తడిసిముద్దయిన నగరం - weather updates

వరంగల్​లో మళ్లీ వర్షం కురిసింది. వాన నీటితో నగర రహదారులన్నీ మునిగిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

heavy rains in warangal
heavy rains in warangal

By

Published : Aug 23, 2020, 5:28 PM IST

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రేక్​ పడిందని ప్రజలు ఊపిరిపీల్చుకునేలోపే వరంగల్​లో మళ్లీ వాన పడింది. వాన నీటితో నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నిన్న కాస్త విరామం ఇచ్చాయి. మళ్లీ ఈరోజు ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో వరద నీరు రోడ్డు ఎక్కడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వరంగల్​లో మళ్లీ వర్షం... తడిసిముద్దయిన నగరం

ఇదీ చూడండి:ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

ABOUT THE AUTHOR

...view details