నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరం తడిసి ముద్దయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మయ్య నగర్, మైసయ్య నగర్, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్, గ్రీన్ సిటీ, సాయినగర్‌లో ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరకులు తడిసిపోయాయి. భారీ వర్షానికి వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నాలుగు రోజులుగా భారీ వర్షం.. జలమయమైన మహానగరం - నాలుగు రోజులుగా భారీ వర్షాలు
నాలుగు రోజులు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో... వరంగల్ మహా నగరం జలమయమైంది. వరద నీరు ఇళ్లలోకి చేరి నిత్యావసర సరకులు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపైకి వరద నీరు రావడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
నాలుగు రోజులుగా భారీ వర్షం.. జలమయమైన మహానగరం
మహబూబాబాద్-ఖమ్మం-వరంగల్ లింకు రోడ్డు... చింతల్ బ్రిడ్జి వద్ద వరద నీరు పోటెత్తింది. దీంతో భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి, వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బంది, పోలీసులు నీటిని మళ్లించి వాహనాలు యథావిథిగా నడిచేలా చర్యలు తీసుకున్నారు. మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్, కమిషనర్ సమీక్షించి సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యల కసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.