వరంగల్ అర్బన్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. హన్మకొండ, వరంగల్, కాజీపేటలో రహదారులు జలమయమయ్యాయి. బాటసారులు తడిసిముద్దయ్యారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ధర్మసాగర్, వేలేరు మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. జనగామ జిల్లా బచ్చన్నపేట, తరిగొప్పులు, నర్మెట్ట మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వరంగల్ గ్రామీణం, ములుగు జిల్లాల్లోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
తడిసిముద్దైన ఉమ్మడి వరంగల్ - వరంగల్లో వర్షం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ వర్షం కురిసింది. వరంగల్ పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
తడిసిముద్దైన ఉమ్మడి వరంగల్