సికింద్రాబాద్ కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం - దామెర రాకేశ్
21:37 June 24
రాకేశ్ సోదరుడు రామ్‌రాజును తగిన పోస్టులో నియమించాలని ప్రభుత్వం ఆదేశాలు
ఈనెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి సందర్భంగా ఆర్పీఎఫ్ కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం డబీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. రాకేశ్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్... రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. అతని కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు రాకేశ్ సోదరుడు రామరాజును తగిన పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారుణ్య నియామకం కింద జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులో నియమించాలని శుక్రవారం ఆదేశాలు వెలువడ్డాయి.
ఇవీ చదవండి: