వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. రాయపర్తి మండలంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ క్రమంలోనే మృతుల బంధువులు వరంగల్-ఖమ్మం రహాదారిపై ధర్నాకు దిగారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఈ సమయంలోనే వరంగల్ నుంచి జఫర్గడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్లో వెళ్లి కరెంటు స్తంభాన్ని గుద్దింది. కరెంటు స్తంభం విరిగి తీగలతో సహా కింద పడింది. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ అత్యుత్సాహం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ఉన్నారు.
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం - warangal urban news
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అత్యుత్సాహంతో రాంగ్ రూట్‌లో బస్సును నడపడమే ప్రమాదానికి కారణమంటున్నారు ప్రయాణికులు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు.
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.