వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వర్షంలోనే మహిళలు బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. సాయంత్రం కురిసిన చిరుజల్లులోనే మహిళలు ఆడి పాడారు. ప్రతీసారి హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలతో కిక్కిరిసి పోయేది.
వర్షంలోనే బతుకమ్మ ఆటలాడిన మహిళలు..
ఓ వైపు కరోనా భయం.. మరో వైపు వర్షం.. వీటి మధ్యే హన్మకొండ ప్రజలు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. ఎక్కడి వారు అక్కడే ఆటలాడుకున్నారు. ఎవ్వరి ఇంటి ముందు వాళ్లే పది మంది కలిసి బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు.
వర్షంలోనే బతుకమ్మ ఆటలాడిన మహిళలు...
ఈసారి మాత్రం వర్షం, కరోనా వల్ల అతి కొద్ది మంది మహిళలు మాత్రమే వచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మరికొద్ది మంది ఎవ్వరి ఇంటి ముందు వాళ్లే పది మంది కలిసి బతుకమ్మ ఆటలు ఆడుకున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఆడిపాడారు.