రాష్ట్ర అదనపు డీజీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంగం మండల పరిధిలోని వంజరుపపల్లి, రామచంద్రపురం గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కల పెంపక క్షేత్రాలను సందర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు.
సంగంలో ఏడీజీపీ ఆకస్మిక తనిఖీ - వరంగల్ గ్రామీణం తాజా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా సంగం మండలంలో రాష్ట్ర అదనపు డీజీపీ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
సంగంలో ఏడీజీపీ ఆకస్మిక తనిఖీ