తెలంగాణ

telangana

ETV Bharat / city

అత్మమామలు, భర్త వేధింపులకు గురిచేస్తున్నారని మహిళ ఆందోళన - women protest

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని అశోక్​నగర్​లో ఓ వివాహిత ఆందోళనకు దిగింది. అత్తమామలు, భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది.

అత్మమామలు, భర్త వేధింపులకు గురిచేస్తున్నారని మహిళ ఆందోళన
అత్మమామలు, భర్త వేధింపులకు గురిచేస్తున్నారని మహిళ ఆందోళన

By

Published : Jul 30, 2020, 7:39 PM IST

తనకు న్యాయం చేయాలని కోరుతూ వరంగల్​లో ఓ మహిళ ఆందోళన చేపట్టింది. ఇంట్లో భర్తతో పాటు అత్త మామలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ... హన్మకొండలోని అశోక్​నగర్​లో భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. అశోకనగర్​కు చెందిన భూక్య బాలరాజుతో నిర్మలకు పెళ్లి జరిగింది. వివాహం జరిగిన నుంచి అత్తమామలతో పాటు భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది.

తనకు ఆడపిల్ల పుట్టడం వల్ల కష్టాలు మరిన్ని ఎక్కువయ్యాయని బాధితురాలు వాపోయింది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకుని ఘటన స్థలికి చేరుకుని... ఇరు కుటుంబాలను సుబేదారి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details