తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐదేళ్లు అధికారంలో ఉండి అవమానించారు: హరీశ్

కేంద్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రాన్ని చిన్న చూపు చూసిందన్నారు హరీశ్ రావు. రాష్ట్రానికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానించిందన్నారు. రాష్ట్రంలో భాజపాకు ఓట్లడిగే హక్కులేదని మండిపడ్డారు. ​

రాష్ట్రంలో భాజపాకు ఓట్లడిగే హక్కులేదు: హరీశ్

By

Published : Mar 23, 2019, 4:56 PM IST

రాష్ట్రంలో భాజపాకు ఓట్లడిగే హక్కులేదు: హరీశ్
ఐదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గణేష్ దేవస్థానం వద్ద ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. అధిష్ఠానం మీద నమ్మకం లేకే కాంగ్రెస్​ నేతలు పార్టీ వీడుతున్నారని ఎద్దేవా చేశారు.సర్పంచ్ నుంచి సీఎం వరకు అందరూ తెరాస వారే ఉన్నారని.. ఎంపీని కూడా గెలిపించుకుంటే నియోజకవర్గ అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details