టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvaraj Singh) ఉదారతను చాటారు. కరోనాపై పోరులో పేదలకు సాయంగా నిలిచారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 120 ఐసీయూ పడకలు ఏర్పాటు చేసి తన గొప్ప మనసును చాటాడు యువీ. రూ.2.5కోట్లతో యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పడకలు అందుబాటులో తీసుకురాగా ఈరోజు యువరాజ్ సింగ్ వర్చువల్గా బెడ్లను ప్రారంభించారు.
మిషన్ 1000 బెడ్స్ నినాదంతో
కలెక్టర్ నారాయణరెడ్డి యూవీకెన్ వార్డులను ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్ అలీ వర్చువల్గా పాల్గొని యువరాజ్ సింగ్ సేవలను కొనియాడారు. దేశంలో వైద్య కళాశాలలు, ఆర్మీ ఆస్పత్రిల్లో వెయ్యి పడకలు ఏర్పాటు లక్ష్యంగా మిషన్ 1000 బెడ్స్ నినాదంతో యూవీకెన్ ఫౌండేషన్ పని చేస్తోందని తెలిపారు. కొవిడ్ పోరులో యువీ సాయం చేయడం అభినందనీయమని హోం మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. తెలంగాణలో మొదటగా అది నిజామాబాద్ ఆస్పత్రిలో యువరాజ్ సింగ్ ఏర్పాటు చేసిన పడకలు పేదలకు ఎంతగానో మేలు చేస్తాయని కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రశంసించారు.