నిజామాబాద్ నగరంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. భాజపా ఎంపీటీసీని తెరాస కార్యకర్తలు కిడ్నాప్ చేసేందుకు యత్నించగా... కమళదళ నేతలు అడ్డుకున్నారు. మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామ ఎంపీటీసీగా కాషాయ దళానికి చెందిన బేగరి సత్తెమ్మ గెలిచారు. ధ్రువీకరణ పత్రం తీసుకుని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లగానే సత్తెమ్మను బలవంతంగా క్యాంపుకు తరలించేందుకు కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు గులాబీ పార్టీ కార్యకర్తలు. విషయం గమనించిన భాజపా నేతలు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందున పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి సత్తెమ్మను తన భర్తకి అప్పగించారు.
భాజపా అభ్యర్థి కిడ్నాప్‌కు యత్నించిన తెరాస నేతలు - BJP
ఓట్లు వేసేటప్పుడే కాదు... కౌంటింగ్ అప్పుడు కూడా అక్కడక్కడా గొడవలు జరిగాయి. నిజామాబాద్‌లో భాజపా అభ్యర్థి విజయం సాధించారనే కోపంతో ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు తెరాస కార్యకర్తలు.
గెలిచిందనే కోపంతో కిడ్నాప్‌కు యత్నించిన తెరాస నేతలు