నీటి కోసం కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా - students dharna
నీటి సమస్య తీర్చాలంటూ నిజామాబాద్ నాందేవ్‌వాడలోని గిరిజన సంక్షేమ వసతిగృహం విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
నీటి కోసం కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా
నిజామాబాద్ నగరంలోని నాందేవ్‌వాడలోని గిరిజన సంక్షేమ వసతిగృహం విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు మురికిగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా రావడం లేదని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి సమస్య తీరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. హాస్టల్ పరిసరాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవటం వల్లనే నీటి సమస్య తలెత్తిందన్నారు.